NTR: తిరువూరు పట్టణంలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రాజుపేట బస్టాండ్ వెనుక బజార్లో 10 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 30వేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పాత తిరువూరులో ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 2,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు గురువారం పోలీసులు తెలిపారు.