AP: ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో బ్యారేజ్ 69 గేట్ల ద్వారా 349 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది.