NZB: భారీ వర్షాల నేపథ్యంలో ఆర్మూర్ పట్టణంతోపాటు, మండలంలోని గ్రామాల్లో ఉన్న రహదారులకు అంతరాయం ఏర్పడితే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సీఐ సత్యనారాయణ గౌడ్ ప్రజలకు సూచించారు. ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షితంగా తమ ఇళ్లల్లో ఉండాలని సూచించారు.