MBNR: జిల్లా కేంద్రంలోని పాత పాలమూరులో ప్రతిష్ఠంచిన గణనాథుడికి విశిష్ట చరిత్ర ఉంది. ఇక్కడ గణపతిని ప్రదర్శించడం ప్రారంభించి దాదాపు 68 సంవత్సరాలు అవుతుంది. పాత పాలమూరులోని శివ రామాంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రతి సంవత్సరం గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్లోని ధూల్ పేటకు చెందిన దేశ్ రాజాసింగ్ అనే కళాకారుడు విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తాడు.