HYD: గణేశ్ నవరాత్రుల సందర్భంగా మండపాలు, నిమజ్జనవేడుకల్లో యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల పని పట్టేందుకు SHE టీమ్స్ సిద్ధమైంది. మూడు కమిషనరేట్ల పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా పోకిరీలపై నిఘా వేశారు. ఎవరూ చూడటం లేదని తోకజాడించాలని చూస్తే వారిని పట్టుకుంటామన్నారు. పోకిరీలు ఇబ్బంది పెడితే 9490617444, 8712662111 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.