VKB: జిల్లాలో బుధవారం కురిసిన వర్షపాతం వివరాలను జిల్లా వాతావరణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అత్యధికంగా మోమిన్‌పేట మండలంలో 44.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, కోట్ పల్లి మండలంలో ఎలాంటి వర్షం కురవలేదని ఆయన పేర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.