కోనసీమ: అయినవిల్లిలో కొలువై ఉన్న విఘ్నేశ్వర స్వామి అన్నదానం ట్రస్ట్‌కు కొత్తపేట వాస్తవ్యులు తమ్మన S.S అఖిలేష్ వారి కుటుంబ సభ్యులు గురువారం రూ. 25,000 విరాళంగా సమర్పించారు. ముందుగా దాతలు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రములతో సత్కరించి స్వామి వారి చిత్రపటం అందజేశారు.