ASR: చింతపల్లి మండలం చెరపల్లి గ్రామంలో పలువురు గిరిజన రైతులకు చెందిన పంట పొలాలు వర్షాలకు కొట్టుకుపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద నీరు వరి పంట పొలాలు పైనుంచి ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం ఉదయం పొలాలు పరిశీలించిన రైతులు మునిగిపోయిన పంట పొలాల పరిస్థితి చూసి దిగాలుపడుతున్నారు.