SKLM: సరుబుజ్జిలిలోని గ్రామాల్లో వినాయక చవితి పండగ సందడి మొదలైంది. గ్రామాల్లోని యువత అంతా కలిసికట్టుగా మండపాలు ఏర్పాటు చేసుకొని వినాయకుని ప్రతిమలను బుధవారం ప్రతిష్టించారు. రకరకాల వినాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడంతో ఆకట్టుకుంటున్నాయి. పురుషోత్తపురంలో ఏర్పాటు చేసిన అయోధ్య వినాయకుడు ఎంతో ఆకర్షణగా నిలుస్తున్నాడు.