ELR: బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరు గ్రామంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయం వద్ద వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం బాలరాజు స్వామివారికి ప్రత్యేక పూజ కైంకర్యాలు జరిపించారు. అలాగే నియోజవర్గ ప్రజలకు ఆయన చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.