అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడేందుకు నాలుగు సార్లు ప్రయత్నించారని జర్మనీకి చెందిన ఓ వార్తాపత్రిక పేర్కొంది. అయితే, మోదీ ఆయనతో మాట్లాడటానికి నిరాకరించారని నివేదిక తెలిపింది. ఇవాళ్టి నుంచి భారతీయ వస్తువులపై 25 శాతం అదనపు సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.