BDK: సెప్టెంబర్ 1న ఇల్లెందులో జరుగు IFTU అనుబంధ భవన నిర్మాణ కార్మికుల మండల స్థాయి సదస్సును జయప్రదం చేయాలి. బుధవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రావూరి ఉపేందర్ రావు పాల్గొన్నారు.