ADB: బోథ్ మండల కేంద్రానికి చెందిన తోట లక్ష్మికి మంజూరైన రూ. 12వేల CMRF చెక్కును ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండ మండల కేంద్రంలో బుధవారం అందజేశారు. సీఎం సహాయ నిధితో పేద ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. వైద్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమర్పించి తద్వారా ఆర్థిక సాయం పొందాలని సూచించారు.