ADB: సమిష్టి నిర్ణయాలతోనే సంఘం బలోపేతం చెందుతుందని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన మథుర లబానా సమాజ సంఘం నాయకులు MLA అనిల్ జాదవ్‌ను నేరడిగొండలోని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. సంఘం అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.