TG: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో బొగ్గు గుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. సమీపంలోని వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.