VKB: జిల్లాలో అత్యధికంగా మోమిన్ పేటలో 76.8MM వర్షపాతం నమోదు అయినట్లు జిల్లా వాతావరణశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. VKB జిల్లాలో మంగళవారం కురిసిన వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షసూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో వాగులు కాలువలు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు.