MBNR: జిల్లా ఎస్పీ జానకి వినాయక మండపాల నిర్వాహకులు పాటించాల్సిన సూచనలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కరపత్రం ప్రకారం ప్రతి మండపం వద్ద కనీసం ముగ్గురు వాలంటీర్లు ఉండాలి. మండపాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అలాగే, కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు.