మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి పోలీసులు బృందం చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో తుపాకులు, నక్సల్ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరణించిన మావోయిస్టుల గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.