KDP: పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పులివెందుల జడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి లతారెడ్డి విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ఘనంగా పూజలు చేశారు. ఈ మేరకు ప్రజలు చేపట్టే కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా దీవించు స్వామి అని ఆమె వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.