వినాయకుడి ముందు గుంజీలు తీస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. దీని వెనుక ఒక కథ ఉంది. ఒకసారి బాల గణేశుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు. విష్ణువు ఎంత బతిమిలాడినా గణపతి ఇవ్వడు. దీంతో విష్ణువు గుంజీలు తీయడం చూసి గణపతి గట్టిగా నవ్వడంతో పొట్టలో ఉన్న సుదర్శన చక్రం బయటకి వస్తుంది. అప్పటినుంచి వినాయకుడి ముందు గుంజీలు తీసే సంప్రదాయం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి.