W.G: గణనాథుని ఆశీస్సులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్, గణేశ్ నగర్, కృష్ణాయపాలెం గ్రామాల్లోని గణేశుని ఉత్సవ మండపాలను దర్శించి పూజలు జరిపించారు. గణపతి నవరాత్రులను ప్రశాంతమైన వాతావరణంలో జరపాలని ఉత్సవ కమిటీలకు సూచించారు.