SS: మడకశిరకు చెందిన జయమ్మ ఇటీవల అనారోగ్యంతో అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది. నిరుపేద కుటుంబం అయిన జయమ్మ కుటుంబ సభ్యులు ఎటూ వెళ్లలేని పరిస్థితిలో ఉండిపోయారు. బాధితులు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకు ఫోన్ చేసి సహాయం కోరారు. స్పందించిన ఆయన సొంత నిధులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.