MHBD: బుధవారం నుంచి ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా తగ్గిన చర్యలు తీసుకోవాలని SP సుధీర్ రామ్నాథ్ కేకన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు SP కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. గణపతి విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.