SRD: దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి తిథిని పురస్కరించుకొని పార్వతీ సహిత సంగమేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళహారతి నైవేద్యం నివేదన చేశారు.