MDK: HSP క్రియేషన్స్, మాతృభూమి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్-1 సినిమా షూటింగ్ తూప్రాన్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. ‘అనగనగా ఒక ఊళ్ళో’ చిత్ర దర్శకుడు సాయి కృష్ణ KV దర్శకత్వంలో రాజశేఖర్ మద్దికుంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో వంశీ, మహిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఆమని, మధుసూదన్, అశోక్ కుమార్, రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.