WGL: చావింటికి వెళ్లొచ్చే సరికి, తమ ఇంటికి దోచేసిన ఘటన ఐనవోలు మండలం వనమాలకనపర్తిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాలు.. పులి యాదగిరి, నాగమ్మ ఈ నెల 22న ఇంటికి తాళం వేసి బంధువు దశదిన కర్మకు వెళ్లి, ఈనెల 26న సాయంత్రం ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంటి డోర్లు తీసి ఉన్నాయి. బీరువాలోని 2.5 తులాల బంగారు గొలుసు, రింగు, 20 తులాల వెండి, దోచుకున్నారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.