TPT: ఏర్పేడు పట్టణంలో దాతలు బుధవారం 200 పైగా మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజలు మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను మాత్రమే ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల జనసేన కార్యదర్శి వెంకటముని, శ్రీకాళహస్తి మండల ప్రధాన కార్యదర్శి అశోక్, జంగాలపల్లి రవిచంద్ర పాల్గొన్నారు.