MBNR: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసినట్టు జిల్లా వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని భూత్పూర్ మండలంలో అత్యధికంగా 61.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. అత్యల్పంగా గండీడ్ మండలంలో 17.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ఇవాళ కూడా మోస్తారు వర్షాలు కురసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.