ADB: గాదిగూడ, నార్నూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో బుధవారం ఉదయం నుంచే మోస్తరు వర్షం మొదలైంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ఇంకా వాగులు, వంకలు వర్షపునీటితో ప్రవహించే అవకాశం కనబడుతోంది. అప్రమత్తమైన రైతులు తమ వ్యవసాయ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. గణేష్ చతుర్థి నేపథ్యంలో నిర్వాహకులకు తమ మండపాల అలంకరణకు ఇబ్బందిగా మారింది.