NRML: ఆర్జీయూకేటి బాసరలో ఇంజనీరింగ్లో అడుగుపెడుతున్న విద్యార్థుల కోసం నిర్వహించిన స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్బంగా విద్యార్థులకు విద్య, వ్యక్తిత్వ వికాసం, మానవ విలువలు, నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి వంటి విభిన్న అంశాలపై అవగాహన కల్పించబడిందని స్టూడెంట్ కోఆర్డినేటర్ మహబూబ్ వివరించారు.