VZM: కొత్తవలస శివారు దేశపాత్రునిపాలెం పంచాయతీ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వీధుల్లో ఉన్న రోడ్లు చెరువును తలపిస్తున్నాయి. కొద్దిపాటి వర్షం పడిన వీధులన్నీ జలదిగ్బంధంతో నిండిపోతుంది. రాత్రిపూట భయం భయంగా గడుపుతున్నామని స్థానికులు వాపోతున్నారు. పలుమార్లు పంచాయతీ అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.