HYD: సికింద్రాబాద్ రైల్వే అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచాలని DRM గోపాలకృష్ణన్ కిందిస్థాయి, అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. స్టీల్ వర్క్ దాదాపుగా చివరి స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఇప్పటికే వెయిటింగ్ హాల్ అందుబాటులోకి రాగా, త్వరలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు వివరించారు.