KNR:కేంద్రమంత్రి బండి సంజయ్ బుధవారం KNRలో ‘మన మోడీ కానుక’ కింద 12 మంది మహిళలకు ఉచిత ఎలక్ట్రికల్ ఆటోలను పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. కొంతమంది స్పాన్సర్ల సహకారంతో ఈ ఆటోలను అందించినట్లు చెప్పారు. కలెక్టర్ చొరవతో ఆటో ట్రైనింగ్ కూడా పూర్తిచేసుకున్న మహిళలు ఇక స్వయం ఉపాధితో ముందుకు సాగవచ్చని అన్నారు.