JN: పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. ఎమ్మెల్యే దంపతులు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టి వినాయకులే పర్యావరణ రక్షణకు మార్గమని వారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.