వినాయక చవితికి స్వామివారికి పెట్టే నైవేద్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కుడుములు, ఉండ్రాళ్లు బలవర్థకమైన ఆహారం. జీర్ణశక్తికి మంచిది. పాయసం, పాలతాలికల్లో ఖనిజాలు ఉంటాయి. మోదకాలు, పూర్ణాల నుంచి ప్రొటీన్లు, సహజ చక్కెరలూ లభిస్తాయి. పెసరపప్పు, బెల్లం, ఉడికించిన శనగలు, అరటి, వెలగపండ్లు తక్షణశక్తిని ఇస్తాయి. పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తాయి.