వినాయక చవితి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అందరికీ హృదయపూర్వక గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. భక్తి, విశ్వాసంతో నిండిన ఈ పవిత్ర సందర్భం అందరికీ శుభం చేకూరుస్తుంది. గణేశుడు తన భక్తులందరికీ ఆనందం, శాంతి, అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. గణపతి బప్పా మోర్యా!’ అని పోస్ట్ చేశారు.