ATP: అనంతపురంలోని నాయక్ నగర్లో 2000 చాక్లెట్లతో బుధవారం సనాతని యూత్ ఆధ్వర్యంలో వినాయకుడిని ప్రతిష్ఠించారు. యువత మాట్లాడుతూ.. కాలనీలోని మిత్రులు అంతా కలిసి 15 అడుగుల చాక్లెట్ విగ్రహాన్ని నెలకొల్పామన్నారు. విగ్రహానికి రూ.1.50 లక్షలు ఖర్చు అయిందన్నారు. ఈ చాక్లెట్ వినాయక విగ్రహాన్ని చూసేందుకు భక్తులు, పిల్లలు, యువత అధికంగా వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు.