SRD: కంగ్టి మండలం తడ్కల్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్గా బూర్గు దీపికను నియమిస్తూ DEO ఉత్తర్వులు జారీ చేశారు. అందోల్ బాలికల హైస్కూల్లో పనిచేస్తున్న ఈమె ఇటీవలే పదోన్నతి పొందారు. ఈ మేరకు ఆమె పదోన్నతి బదిలీపై మంగళవారం తడ్కల్ హైస్కూల్లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో వ్యాయామ విద్య క్రీడలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు.