W.G: పెనుగొండ ఇండియన్ గ్యాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మంగళవారం మునమర్రు గ్రామానికి చెందిన తానేటి సత్యానందం(37) తన మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా, వేగంగా వచ్చిన కూల్ డ్రింక్స్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై సత్యానందం అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు.