HNK: తృణ ధాన్యాలతో కలిగే లాభాలను వివరించే ఓ ప్రయత్నంలో చిన్నారి పేపర్‌పై గణేషుడిని రూపొందించింది. నయీంనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సాయిప్రకాష్ కూతురు లాస్య వినూత్నంగా తృణధాన్య బొజ్జగణపయ్యను తయారు చేసింది. పండుగలు, సంస్కృతీ, సంప్రదాయాలు తదితర అంశాలపై లాస్య తరచుగా చిత్రాలు, పెయింటింగ్ తదితర కళా ప్రదర్శనలు చేస్తోందని ఆమె తండ్రి తెలిపారు.