KDP: సిద్ధవటం మండలం ఉప్పరపల్లిలో వినాయక చవితి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల ఆలయంలో ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.