SKLM: బొడ్డపాడు, మామిడిపల్లి గ్రామాలలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పలాస పీఎసీఎస్ డైరెక్టర్ బొడ్డు దుష్యంత్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే గౌతుశిరీష ఆదేశాల మేరకు వినియోగదారులకు డిజిటల్ కార్డులు అందజేయడం జరిగిందని తెలియజేశారు. దీంతో అవసరమైన సరుకులు తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.