RR: ఈరోజు వినాయక చవితి సందర్భంగా షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ కార్యాలయంలో గణపయ్యకు ఘనంగా పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఐక్యత, భక్తి శ్రద్ధలతో నవరాత్రి వేడుకలు జరుపుకోవాలన్నారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా తెలంగాణ సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.