E.G: ప్రతి ఒక్కరూ చేపట్టిన పనులు సఫలీకృతం కావాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా దేవరా పల్లిలోని తన స్వగృహంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజ నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుడిని కోరినట్లు తెలిపారు.