భవిష్యత్ తరాలకు తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవటం ముఖ్యమని రక్షణమంత్రి రాజ్నాథ్ పేర్కొన్నారు. ఫ్యూచర్లో యుద్ధాల రూపురేఖలు మారిపోతాయి. సాంకేతికత, సైబర్ వార్, మానవరహిత యుద్ధ వాహనాలు, ఉపగ్రహ ఆధారిత నిఘా వంటి వాటిని ఆయుధాలుగా ఉపయోగిస్తారు. వీటిల్లో ఆరితేరిన దేశాలే నిజమైన ప్రపంచశక్తిగా ఎదుగుతాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి’ అని తెలిపారు.