SRCL: శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని, జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయకుడికి జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ప్రత్యేక పూజలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలను అందరిని సుఖ సంతోషాలు,శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరారు.