MNCL: వినాయక చవితిని పురస్కరించుకొని కవ్వాల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో వినాయక చవితి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు మాట్లాడుతూ.. వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడుగా భక్తుల మదిలో నిలిచిపోయాడన్నారు. ఆ విఘ్నేశ్వరుని చల్లని దీవెనలతో గ్రామంలోని ప్రజలంతా పాడి పంటలతో, సిరి సంపదలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.