WGL: కాలుష్య నివారణ, పర్యావరణ హితానికి సుతిల్ తాళ్లతో రూపొందించిన వినాయకుడు అందరిని ఆకట్టుకుంటున్నాడు. చౌరస్తాలోని డాల్ఫిన్ గల్లీలో మొబైల్ ఫోన్ పరికరాలు విక్రయించే వ్యాపారులు సుతిల్ తాళ్లతో తయారు చేసిన గణపతిని ఏర్పాటు చేసి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అయితే తాము ప్రతీ సంవత్సరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు గణపతిని నిర్వహిస్తామని తెలిపారు.