KDP: కడప ఎంపీ వై. ఎస్. అవినాష్ రెడ్డి చిత్రపటానికి సింహాద్రిపురంలో బుధవారం పాలాభిషేకం చేశారు. ఇందులో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నాయకులు కేకు కట్ చేశారు. అనంతరం సింహాద్రిపురం అభివృద్ధికి ఎంపీ చేసిన కృషిని నాయకులు వెన్నపూస రామ్మోహన్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాజగోపాల్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.