TG: మెదక్ జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రామాయంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీని వరద ముంచెత్తింది. హాస్టల్ భవనం చుట్టూ వరద చేరడంతో.. 350 మంది విద్యార్థులు బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు. తమని రక్షించాలంటూ విద్యార్థులు ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో వారిని బయటకు తెచ్చేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు.